స్వచ్చోద్యమ మనగనేమి?
బ్రహ్మ ముహూర్తాన లేచి, బజార్లలో కసవులూడ్చి,
శ్మశానమున సంచరించి, మురుగుకాల్వ సిల్టు తోడి
ఊరంతటి స్వస్తతకై ఉరుకులు పరుగులు పెట్టే
స్వచ్చ కార్యకర్తలనెడి పిచ్చివాళ్ల స్వర్గం అది!