దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 4 నా సంతోషం నాదండీ! బజార్లు బాగుచేసే పనుల్లోకి కొత్తగా వచ్చిన శివపార్వతి నండి - మూడేళ్ల నుండి నేను గూడ ఊరికి పనికొచ్చే పనేదైనా చేయాలని ఎన్నిసార్లు అనుకొన్నానో, ...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 3 గౌరవనీయులైన స్వచ్ఛ సుందర చల్లపల్లి రధ సారధులకు, కార్యకర్తలకు మరియు పెద్దలకు హృదయ పూర్వక నమస్కారంలు నా పేరు లయన్ తగిరిశ సాంబశివరావు నేను సాయి నగర్ కాలనీ పద్మావతి గారి హాస్పిటల్ దగ్గర లొ ఉంటాను. నేను Srysp జూనియర్ కళాశాలలొ ఇంగ్లీష్ లెక్చరర్ గా మరియు ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. డాక్టర్ గారు మరియు మేడం గార...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 2 - నడకుదురు లీలా బ్రహ్మేంద్ర (జర్నలిస్ట్ – ఆంధ్రజ్యోతి దినపత్రిక) ఆ రోజు జనవరి 1..2015. కొత్త సంవత్సరం ప్రారంభం. ప్రతి ఏటా కొత్త సంవత్సరం రోజున సెంటరులో ఉండి 12 గంటలు అయిన తర్వాత అందరికీ శుభాకాంక్షలు తెలియచేసి సెంటరులో...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 1 అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం! ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఉద్యమం ప్రతి ఊరికీ అనివార్యమూ, అవశ్యకమూ! కేవలం పంచాయతీ, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలతోనే గ్రామ వీధుల పచ్చదనమూ, పరిశుభ్రతా, ఆహ్లాదమూ నిలబడతాయనుకోవడం వివేకం కాకపోవచ్చు!...
Read Moreపొడి మాటల్లో తేల్చే సంగతా -3000* నాళ్ళ స్వచ్చ సుందరోద్యమం! “కట్టె - కొట్టె - తెచ్చే” అని ముగించేదా కార్యకర్తల మూడు లక్షల శ్రమదానం? ఆ అనుభవాలు, ఆ అభినివేశాలు, అద్భుతాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఉపశమనాలు, దగ్గరుండి వీక్షిస్తే తప్ప చూడని వాళ్లకు అర్థమయేలా చెప్పడానికి మనం కాళిదాసులమా – శ్రీ శ్రీ లమా. ...
Read Moreఆనంద - ఆరోగ్య వర్థిని – మా స్వచ్చోద్యమ చల్లపల్లి. ప్రతి బ్రహ్మముహుర్తంలోనూ పాతిక ముప్పై మందితో కలిసి, పాతిక – ముప్పై వేల మంది గ్రామస్తుల ఆరోగ్యం కోసం శ్రమించడం ఎంత సంతోషమో కదా! ఈ ఉద్యమం తొలి రోజుల్లో వినడానికి వింతగా అనిపించింది - తుస్సు మనకుండా ఎన్నాళ్లు నిలుస్తుందిలే అనిపించింది. చూస్తుండగానే 50-100-200 రోజులు గడిచిపోతే గాని నేనందుల...
Read Moreఊరి బాధ్యతంతా మనదేననుకొని..... పెద్దా - చిన్నా కార్యకర్తలందరికీ నమస్కారాలండి! నా పేరు ముత్యాల లక్ష్మి. చంటి హోటలంటే చాలు - అందరికీ బాగా తెలుస్తుంది. ఎవరికి వాళ్లం కుటుంబాల - పిల్లల బాధ్యతల్ని చూసుకోవడమే చాల గొప్పండి. మరి అవి చూసుకొంటూనే నా బజారు, నా ఊరు పరిశుభ్రతల బరువు మోయడమంటే - అదీ తొమ్మిదేళ్ళ నుండీ - ఎంత మంచి పెద్ద పనో ఆలోచిస్తుంటే ఈ స్వచ్ఛ కార్యక్రమం ఎంత గొప్పదో అర్థమౌతున్నది. ...
Read Moreఈ ఉద్యమం ఎంత సులభమనిపిస్తుందో అంత కష్టం అందరికీ వందనాలు. నేను పసుపులేటి ధనలక్ష్మి నండి. పెద్ద చదువు లేకపోయినా మొదట్లో ధైర్యంచేసి రాలేకపోయినా, 50 రోజుల తరవాత వచ్చి కలిసినా, ఇంత పెద్ద పెద్దవాళ్లు నన్ను కూడ తమతో సమానంగా - ఒక స్వచ్ఛ కార్యకర్తగా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలండి. ...
Read Moreజై గురుదేవ! జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!! పెద్దలకూ – పిన్నలకూ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చల్లపల్లి సెంటర్ లో జరిగిన శ్రమదానోద్యమ శత దినోత్సవం నుండీ నాకీ కార్యక్రమంతో అనుబంధం ఏర్పడింది. నాకు ఏ రోజైనా - ఏ కారణం చేతైనా దీని పట్ల కాస్త పట్టుదల తగ్గినప్పుడల్లా - వాళ్లది కాని గ్రామ సౌకర్యాల కోసం లక్షలు ఖర్చు చేస...
Read Moreఉద్యమంలో పాల్గొనకముందూ – తర్వాతా అందరికీ నమస్కారాలు తండ్రీ! 10 నెలలుగా ఊరి శ్రమదానానికి దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసుకొన్న పల్నాటి అన్నపూర్ణనండి! యాక్సిడెంట్ లో కాలు నుజ్జై, బహుళ శస్త్రచికిత్సలు జరిగి, నెలల తరబడి ఫిజియోథెరపీల తర్వాత గత నాలుగు రోజుల నుండీ మన స్వచ్చోద్యమ ప్రపంచంలోకి నా కాలు మోపుతున్నందుకు ఆనందంగా ఉన్నది. ...
Read Moreఇదొక లోకోత్తర త్యాగము! హిమాలయములు ఎక్కుటా ఇది? ప్రమాదాలను కౌగిలించుట? గాలిలో వ్రేలాడు ఆటా? నేల విడిచిన సాము చేటా? ...
Read More