రామారావు మాష్టారి పద్యాలు

20.02.2026...

    గాలి వాటమొ నీటి బుడగా? గాలి వాటమొ నీటి బుడగో కాదుసుమ ఈ శ్రమోద్యమము చల్లపల్లి ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిగ’ మారు వరకూ పర్యావరణం బాగుపడి మన ప్రజాస్వస్తత గెలుచువరకూ ...

Read More

19.02.2026...

      సహకరించద ఇప్పుడైనా? అహరహం అణువణువు శోధనె, ఆత్మ శీలనె, సదవగాహనె చిన్న పొరపాటైన జరుగక - చేయు కృషులకు పునశ్శోధనె కనుకె దైనందిన శ్రమోద్యమ మునకు చక్కని ప్రజాస్పందన ...

Read More

18.02.2026...

 కార్యకర్తా! వందనం! ఇదేదో ఒక పూట కాదే-రోజుకాదే-నెలయుకాదే ఏకముగ ఒక పుష్కరంగా ఏకబిగిగా శ్రమోద్యమమే- సమయదానమె-అర్థదానమే-కాయకష్టమె-నిరంతరమే! కనుకనే ఓ స్వచ్ఛ సుందర కార్యకర్తా! వందనం!...

Read More

17.02.2026...

 ఊరి పాపాల్ కడిగి వేయుచు వీధిలోపాల్ చక్కదిద్దుచు- ఊరి పాపాల్ కడిగి వేయుచు ప్రతి గజానికి మొక్క నాటుచు-హరిత సంపద వృద్ధితో రా బోవు తరముకు మేలు చేయుచు-స్పూర్తి నింపే, మేలుకొలిపే స్వచ్ఛ సుందర కార్యకర్తల సంస్కృతికి అభివందనం!...

Read More

16.02.2026...

   సుమాలంకృత వీధులున్నవి సుమాలంకృత వీధులున్నవి-శ్రమాలంకృత గ్రామమున్నది బాటలన్నిటి రెండు ప్రక్కల బారులుగ వృక్షాలు ఉన్నవి ఇంతకన్నా ఏమి కావలె నేత్రపర్వం కలుగడానికి? ఇప్పుడైనా కార్యకర్తల కెందుకో మరి సహకరించర...

Read More

15.02.2026...

                   పూలబాలల సొగసు నాట్యం తెలుసుకొనరా కార్యకర్తల దీర్ఘకాలపు కాయకష్టం? చూడలేరా సొంత ఊళ్లో స్వచ్ఛ సుందర శుభ్ర దృశ్యం? బైట దారుల-శ్మశానమ్ముల పూలబాలల సొగసు నాట్యం? ఇపుడు కూడా కార్యకర్తల కెందుకయ్యా సహకరించరు?...

Read More

14.02.2026...

 ఏదనర్హం వీళ్ళ సేవకు? రామనగరమొ-చల్లపల్లో వెంకటా-శివరామపురములొ యార్లగడ్డో-పురిటిగడ్డో.... ఏదనర్హం వీళ్ళ సేవకు? మనసు కలిగితె మార్గముండును కాయకష్టమె పెట్టుబడిగా స్వచ్ఛ సుందర కార్యకర్తలు చక్కదిద్దిరి కొన్ని ఊళ్లను!  ...

Read More

13.02.2026...

 చేతులన్నీ బొబ్బలెక్కగ   “చల్లపల్లి-వెంకటాపుర బాట సుందర హరితమయముగ ...

Read More

12.02.2026 ...

             కష్టమక్కరకొచ్చినట్లే! మూడువేలా ఏడు వందల నాళ్ళ శ్రమ హద్దుగా ఇక ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లికి గడ్డు రోజులు దాటినట్లే! MTM రహదారి భాగం హరిత వనమై పోయినట్లే! నెలల తరబడి కార్యకర్తల కష్టమక్కరకొచ్చినట్లే! ...

Read More
<< < ... 16 17 18 19 [20] 21 22 23 24 ... > >>