రామారావు మాష్టారి పద్యాలు

18.10.2022...

         పరిశుభ్రతె పరమాత్మని పరిశుభ్రతె పరమాత్మని ప్రాచీనులు సెలవస్తే అంతరంగ స్వచ్ఛతయే ఆరోగ్య రహస్యం ఐతే ప్రజలందరి స్వస్తతయే మనమేలని తలపోస్తే అలాంటి సంస్కృతి కొరకే స్వచ్చోద్యమ మనుకొంటే......

Read More

17.10.2022...

           శ్రమ జీవన సంగీతం! విడదీయరాని అనుబంధం వీధుల పరిశుభ్రతతో ఎడబాయని సంబంధం గ్రామజనుల స్వస్తతతో సామూహిక సమున్నతే స్వచ్చోద్యమ అభిమతం సకల జనుల ఆరోగ్యమే శ్రమ జీవన సంగీతం!...

Read More

16.10.2022...

             వారి పాత్ర ప్రశ్నార్థకం! సాగుతోంది అష్ట వర్ష స్వచ్చోద్యమ వింత రథం స్వార్థ రహిత శ్రమ జీవన శ్రావ్య వినుత సంగీతం అవి ఎవరికి శుభకరములొ – అలరించేదెవ్వరినో వారి పాత్ర పరిమితమై నిలుచుటె ప్రశ్నార్థకం!   ...

Read More

14.10.2022...

                   కావ్యకర్తలెవరంటే సుమ సుందర చల్లపల్లి సుమనోహర కావ్యమా! కావ్యకర్తలెవరంటే - కార్యకర్తలను నిజమా! గ్రంథరచన సమయమందు కావ్యానంద విభ్రమమా! అలౌకికానందమేన! ఆచరణ ప్రధానమా!...

Read More

13.10.2022...

          జగతి శిరోధార్యమా అనూహ్యమా - అమోఘమా – అనన్యమా - అశేషమా? వివేకమా – విలాసమా – వికాసమా - వినోదమా! స్వచ్ఛ కార్యకర్త తెగువ సమాజాని కవసరమా? సాహసాల చల్లపల్లి జగతి శిరోధార్యమా?...

Read More

12.10.2022...

           అందరికీ బొట్టుపెట్టి ‘నాకెందుకు’ అనుకొంటే స్వాతంత్ర్యం దక్కేదా? ‘మనకెందుకు’ అనుకొనడం మంచి వాళ్ల లక్షణమా? ఊరు బాగుపడు పనులకు పూనిక అవివేకమా? అందరికీ బొట్టుపెట్టి ఆహ్వానం అవసరమా...

Read More

11.10.2022...

               అత్యద్భుత మార్గదర్శి! కొన్ని వింత సంఘటనలె క్రొత్త చరిత కానవాళ్లు ఒక్క మంచి నిర్ణయమే ఒక ఊరికి మేలు మలుపు ఆ ఘటనమె - నిర్ణయమే ‘స్వచ్చోద్యమ చల్లపల్లి’ అదిక పైన దేశానికి అత్యద్భుత మార్గదర్శి!...

Read More

10.10.2022 ...

       మన స్వచ్చంద శ్రమదానం ఆశావహ దృక్పథమున అడుగులు వేస్తున్నది! సొంత ఊరి కాలుష్యం అంతు చూచునంత దాక -   ప్రతి పౌరుని చైతన్యం పడగ విప్పి లేచు దాక – ఒక సుదీర్ఘ సమరానికి ఉద్యుక్తం ఔతున్నది!...

Read More

09.10.2022...

            ఎట్టి వెలుగుల కిట్టి పయనం! ఎందుకయ్యా ఇంత కష్టం ఎవరిదండీ ఇంత స్వేదం! శ్మశానాలను మురుగు డ్రైన్లను సంస్కరించే టంత స్థైర్యం! ఈ గ్రామం ఏ కాలం ఎచట చూసిన దింత త్యాగం! ఎట్టి వెలుగుల కిట్టి పయనం! ఎవరి అభ్యున్నతికి మార్గం?    ...

Read More
<< < ... 106 107 108 109 [110] 111 112 113 114 ... > >>